ఓటు వేసిన ప్రముఖులు

posted on: Feb 2, 2016 9:37AM

 

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో రోడ్‌ నంబర్ 10 పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హైదరాబాదీలంతా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని.. నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు

 

 

తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  బంజారాహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. తెలుగుదేశం పార్టీకి ఓటంటే అది అభివృద్ధికి ఓటు వేసినట్లేనని అన్నారు.

 

 

గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి ఓటు హక్కువినియోగించుకున్నారు. ఖైరతాబాద్ పోలింగ్ బూత్‌లో గవర్నర్ నరసింహన్, ఆయన భార్య ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. తాను ఒక సిటిజన్‌గా ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు.

 

 

టీడీపీ యువనేత నారా లోకేశ్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 

 

హీరో నాగార్జున, అమల జూబ్లిహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తనకు ఓటేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని ఉందని ధీమా వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...