Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ ది అతి విశ్యాసమా? ఆత్మవిశ్వాసమా..?
posted on: Jan 12, 2016 5:02PM

తాను ఏమాత్రం తక్కువ కాదని.. తనకూ పార్టీని గెలిపించే సత్తా ఉందని నిరూపించుకోవడానికేమో కానీ గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కొడుకు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కాస్త దూకుడుగానే ప్రవరిస్తున్నారు. అంతేకాదు తన తండ్రికి కాని.. బావ హరీశ్ కు కాని ఛాన్స్ ఇవ్వకుండా గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకన్నాడు. అయితే గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ల ఓట్లు పడాలంటే కాస్త కష్టపడాల్సిందే. ఎందుకంటే ఉద్యమ సమయంలో సీమాంధ్రులను తిట్టిన తిట్లు అలాంటివి మరి. అలాంటప్పుడు సెటిలర్లు మనసు గెలిచి వారి ఓట్లు సంపాదించి గెలవాలంటే కాస్త రిస్కే. అయితే కేటీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని అప్పుడే జోస్యం కూడా చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా మొత్తం 150 డివిజన్లు ఉండగా అందులో వంద డివిజన్లలో తమ పార్టీ గెలుస్తుందని.. ఒకవేళ గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఇప్పుడు కేటీఆర్ విసిరిన సవాల్ పైనే అసలు చర్చంతా జరుగుతుంది. గెలుపుపై అంత ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే తన మంత్రి పదవికి నిజంగానే రాజీనామా చేస్తారా అని అందరి ప్రశ్న. ఆవేశంగా కేటీఆర్ అయితే సవాల్ చేశారు.. మరి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందా.. కేసీఆర్.. హరీశ్ రావు అంటే రాజకీయ ఉద్దండులు కాబట్టి వారి వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునేవారు.. మరి కేటీఆర్ కూడా సెటిలర్ల మనసును గెలుచుకోగలరా.. గెలిచి తమ గెలుపును కైవసం చేసుకోగలరా.. ఇదంతా కేటీఆర్ అతి విశ్యాసమా.. లేక ఆత్మవిశ్వాసమా అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా కండీషనల్ సవాల్ అని… ఇతర పార్టీల నాయకులు తన సవాల్ ను ఒప్పుకోలేదు కాబట్టి తాను కూడా దాన్ని లైట్ తీసుకున్నానని కేటీఆర్ అనే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరి కేటీఆర్ సవాల్ గురించి ఏది తెలియాలన్న ఎన్నికలు అవ్వాల్సిందే.. ఫలితాలు రావాల్సిందే.. అప్పటి వరకూ ఆగాల్సిందే.






