ఇదెక్కడి ఎన్నికల ప్రచారంరా బాబు..?

posted on: Jan 9, 2016 2:02PM

ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలు ఎలాగూ ప్రచారం చేస్తారు కాని.. కేంద్ర మంత్రులతో ప్రచారం చేయిస్తే నాలుగు ఓట్లు ఎక్కువ రాలుతాయి అని ఆశతో స్థానిక నేతలు కేంద్రం నుండి తమ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి నేతలను తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు తిప్పలంతా.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీజేపీ తరపు నుండి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాధామోహన్ సింగ్, హన్సరాజ్ గంగారామ్, వెంకయ్యనాయుడు పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగూ పార్టీ గురించి నాలుగు మాటలు చెబుతూ.. ప్రతిపక్ష పార్టీ గురించి నాలుగు విమర్సలు చేస్తూ మాట్లాడటం సహజం. ఇక్కడి వరకూ బానే.. అదే కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి అయన కేసీఆర్ ను.. ఆయన చేపట్టిన పథకాలను పొగడటం.. కేసీఆర్ చేత కూడా వాళ్లను పొగిడించుకోవడంతో తాము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపుతున్నట్టు ఉందని..స్థానిక బీజేపీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందట.

 అంతేకాదు ఇప్పటికే బీజేపీలో ఉన్న బండారు దత్తాత్రేయ ఇలానే వ్యవహరిస్తున్నారు.. ఇప్పుడు కేంద్రం నుండి వచ్చే కేంద్ర మంత్రులు కూడా అలానే చేస్తున్నారని స్థానిక బీజేపీ తెగ ఫీలవుతున్నారంట. అంతేకాదు ప్రచారంలో పాల్గొని ప్రతిపక్ష నేతలను విమర్శించాల్సింది పోయి.. ఆ నేతలను పొగడటం ఏంటని.. ఇదెక్కడి ప్రచారంరా దేవుడా అని మదనపడుతున్నారంట. దీనిపై త్వరలో పార్టీ అధినేత అమిత్ షాకు కూడా కంప్లైట్ ఇవ్వాలని చూస్తున్నారంట. చూద్దాం ఆ తరువాతైనా నేతల ధోరణి మారుతుందేమో.

google-ad-img
    Related Sigment News
    • Loading...