ఇక మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
posted on: Feb 11, 2026 8:55AM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ బుధవారం (ఫిబ్రవరి 11) ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఐదేళ్ల గడువు మంగళవారం (ఫిబ్రవరి 10)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది.
ఈ విభజన తక్షణమే అమలులోకి వచ్చింది. అంతే కాకుండా మూడు కార్పొరేషన్లకు కూడా కొత్త కమిషనర్లను నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






