నెయ్యి ట్యాంకర్ బోల్తా...బకెట్‌లతో ఎత్తుకెళ్లిన స్థానికులు

posted on: Mar 9, 2026 7:01PM

 

కడప జిల్లా కొండాపురం మండలంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని చిత్రావతి వంతెన సమీపంలో నెయ్యితో వెళ్తున్న ఒక ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. వంతెన వద్ద ట్యాంకర్ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో, అందులోని నెయ్యి భారీగా రోడ్డుపైకి, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రవహించింది. ట్యాంకర్ బోల్తా పడి నెయ్యి నేలపాలవుతోందన్న వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది .

విషయం తెలిసిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చేతికి దొరికిన బిందెలు, బకెట్లు, చెంబులు, బాటిళ్లతో నెయ్యిని పట్టుకోవడానికి పోటీ పడ్డారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని తోడుకోవడానికి అబాలగోపాలం ఎగబడటంతో అక్కడ సందడి నెలకొంది. ​ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ, జనం మాత్రం నెయ్యిని సేకరించడంలోనే నిమగ్నమయ్యారు. ప్రమాదంలో డ్రైవర్‌కు జరిగిన గాయాల వివరాలు తెలియాల్సి ఉంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...