బాల బాబాయ్ గెట్ వెల్ సూన్.. జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ స్పందన.!

posted on: Jul 21, 2026 5:27PM

 

హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ  షూటింగ్‌లో  గాయపడటం పట్ల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బాలా బాబాయ్ త్వరగా కోలుకుని వెండితెరపై సింహంలా గర్జించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.   గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది.  

బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా   నందమూరి కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ  బాబాయ్ త్వరగా కోలుకుని, షూటింగ్ సెట్స్‌లోకి మళ్లీ  సందడి చేయాలని  ర్కొన్నారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్  బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇలా ఉండగా షూటింగ్ తో గాయపడిన బాలయ్య, వైద్యుల సలహా మేరకు   కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు.  అలాగే.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి అభిమానులు, సినీ దిగ్గజాలు, రాజకీయనాయకులు  ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

Get Well Soon Bala Babai, Jr NTR Tweet,  Balakrishna, Nandamuri Balakrishna Injury, Movie Shooting Injury 

google-ad-img
    Related Sigment News
    • Loading...