Latest News

గౌతీ ఫ్యామిలీ @ సింగపూర్

posted on: Mar 26, 2026 2:18PM

టీమ్ ఇండియా హెడ్ కోచ్  గౌతమ్ గంభీర్ సింగపూర్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తన కుమార్తెలు అజీన్, అనైజా, భార్య నటాషాలతో సింగపూర్ లో హాలీడే మూడ్ లో విహరిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజయం వెనుక గౌతం గంభీర్ వ్యూహాలు ఉన్నాయి. జట్టును సమతూకంలో ఉంచడంలోనూ, ఆటగాళ్ల ప్రతిభను వంద శాతం రాబట్టడంలోనూ గౌతం గంభీర్ విరామమెరుగకుండా కృషి చేశాడు.  గౌతం గంభీర్ వ్యూహాలు, కఠోర శ్రమ కారణంగా టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జగజ్జేతగా నిలిచింది. ఇందు కోసం ఎంతో ఒత్తడి తీసుకుని, శ్రమించిన గౌతం గంభీర్  నెక్స్ట్ టోర్నీకి సన్నాహాలు ప్రారంభించడానికి ముందు లభించిన ఈ విరామాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.  

సింగపూర్ వీధుల్లో గంభీర్  సామాన్యుడిగా పెళ్లాం పిల్లలతో విహరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.   భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి ఆయన అక్కడి అందాలను తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా  తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని వీధుల్లో నడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైదానంలో ఎంతో సీరియస్‌గా కనిపించే గంభీర్, వ్యక్తిగత జీవితంలో  అందుకు భిన్నంగా సరదాగా కనిపించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.    2007లో ఆటగాడిగా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన గౌతం గంభీర్.. 2026లో జట్టు హెడ్ కోచ్ గా టీమ్ ఇండియాకు ప్రపంచకప్ ను అందించాడు.  జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కోచ్‌ల జాబితాలో  లాల్‌చంద్ రాజ్‌పుత్, రాహుల్ ద్రవిడ్ సరసన సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.  

ప్రస్తుతం ఈ విహారయాత్ర ముగిసిన తర్వాత గంభీర్ తిరిగి తన బాధ్యతల్లో నిమగ్నం కానున్నారు. టీమిండియా తదుపరి షెడ్యూల్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌లో భాగంగా భారత్ ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.  ఆ తరువాత  టీమ్ ఇండియా   ఐర్లాండ్ , ఇంగ్లండ్‌లలో పర్యటించనుంది. వరుస విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలో.. మధ్యంలో లభించిన ఈ విరామంలో  గంభీర్‌  మానసికంగా ధృఢంగా తయారు కావడానికి దోహదపడుతుందని అన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...