Latest News
హోటల్ బిల్లులో అదనంగా గ్యాస్ యూసేజ్ చార్జి!
posted on: Mar 13, 2026 2:01PM

ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొం టున్న సమయంలో హోటల్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. ఈ పెంపులో హోటల్ యాజమాన్యాలు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాజాగా ఒక హోటల్ బిల్లులో టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు కూడా వేసి వసూలు చేయడం గమనార్హం.
ఆ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బిల్లులో టిఫిన్ ధరతో పాటు గ్యాస్ ఛార్జ్ పేరిట అదనపు సొమ్ము మెన్షన్ చేయడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెరుగుతున్న ఎల్పీజీ ధరల కారణంగా కొన్ని హోటల్ యాజమాన్యాలు ఈ విధంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టిఫిన్ ధరలోనే వంట ఖర్చులు ఉండాలి గానీ, ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు.
అసలు విషయంలోకి వస్తే చెన్నైలోని పెరుంగుడి పరిధి తిరువెంకడనగర్ ప్రాంతంలో ఉన్న గీరాస్ రెస్టారెంట్ కివెళ్లి చేసిన ఓ కస్టమర్.. ఆ తరువాత హోటల్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి స్టన్ అయిపోయాడు. ఇంతకీ ఆ బిల్లులో తాను తిన్న టిఫిన్ ధరలతో పాటు బిల్లులో గ్యాస్ యూసేజ్ చార్జ్ పేరుతో అదనంగా కొంత మొత్తాన్ని చేర్చి ఉంది. హోటల్‌లో వండిన ఆహారం తినడానికి వచ్చిన కస్టమర్‌లపై వంట గ్యాస్ ఖర్చును ప్రత్యేకంగా వేయడం ఏమిటని షాక్ అయిన ఆ కస్టమర్ వెంటనే ఆ బిల్లును సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది వెంటనే వైరల్ అయ్యింది. దీనిపై నెటిజనులు తెగ సెటైర్లు వేస్తున్నారు. వినియోగదారుల సంఘాలైతే మండిపడుతున్నాయి.



.webp)


