గన్నవరం టు సింగపూర్ విమాన సేవలు ప్రారంభం
posted on Nov 15, 2025 11:38AM

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడప నుంచి. శనివారం ప్రారంభమైన ఈ విమాన సర్వీసును విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు లాంఛనంగా ప్రారంభించారు.
గన్నవరం నుంచి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసు ప్రారంభం కావడంతో రాజధాని అమరావతి నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అంటున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం, సింగపూర్ విమాన సర్వీసును వారానికి మూడు రోజులు నడపనుంది. గన్నవరం సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభంతో రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల కు సంబంధించి కీలక పురోగతి సాధించినట్లయ్యింది.
ప్రయాణీకుల సంఖ్య, వయబులిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు సింగపూర్ కు విమానసర్వీసులు నడుపుతుంది. మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఇందులో భాగంగా తొలి విమానం ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు గన్నవరం నుంచి సింగపూర్ కు బయలుదేరింది. .