బెంగళూరు విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

posted on: Nov 29, 2025 8:49AM

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో  భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. దీంతో ఒక్క నవంబర్ నెలలోనే బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన ఈ  గంజాయి విలువ 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.   తాజాగా బ్యాంకాక్‌ నుండి బేంగళూరుకు  వచ్చిన నలుగురు విదేశీ ప్రయాణీకుల తీరుపై అనుమానంవచ్చిన కస్టమ్స్ అధికారులు వారినిఅదుపులోనికి తీసుకుని విచారించడంతో గంజాయి స్మగ్లింగ్ బయలపడింది.

గంజాయి స్మగ్లింగ్ కు వారు అనుసరించిన విధానం పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహా రాన్ని మించి ఉంది. వీరు గంజాయిని ఎనర్జీ డ్రింక్ టిన్నులలో ఎలాంటి అనుమానం కలగనితీరులో ప్యాక్ చేసి తీసుకువచ్చిన తీరు కస్టమ్స్ అధికారులనే విస్మయపరిచింది.  వీరి నుంచి 179 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా అరెస్టైన నలుగురు విదేశీ స్మగ్లర్లలో కలిపి నవంబర్ నెలలో మొత్తం 32 మంది స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదే నెల మొదటివారంలో 94 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని స్వీధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...