Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో భారీగా గంజాయి పట్టివేత
posted on: Mar 9, 2026 9:51AM
.webp)
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 3 కోట్ల 18 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనంన చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
వియత్నాం క్యాపిటల్ హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు వ్యక్తులు దిగారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిరువురినీ అదుపులోనికి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారి సామానులో దాచిన హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది.
మొత్తం 9.10 కిలోల బరువున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3.18 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో అరెస్టు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి సేకరించారు, భారత్‌కు ఎలా తరలిం చారు. అంతర్జాతీయ డ్రగ్ ముఠాల సంబంధం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగి స్తున్నారు.


.webp)
.webp)


