హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్.. ఉద్రిక్తత
posted on: Feb 19, 2026 1:34PM
.webp)
హైదరాబాద్ లో యువకుల మధ్య గ్యాంగ్ వార్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ బస్తీలో స్కూల్ విద్యా ర్థుల మధ్య ప్రారంభమైన చిన్న వివాదం క్రమక్రమంగా పెద్ద గొడవగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.స్థానికంగా చదువుకుంటున్న కొందరు విద్యార్థుల మధ్య జరిగిన తగాదా తర్వాత వారి అనుచరులు కూడా రంగం లోకి దిగడంతో పెద్ద ఘర్షణగా మారింది.
దీంతో రెండు గ్యాంగ్‌లుగా యువకులు రోడ్లపైకి వచ్చి కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదు పులోకి తీసుకువచ్చారు. గుంపులుగా తిరుగుతున్న యువకులను చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో వినాయక్ నగర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ మైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా అక్కడ అదనపు పోలీసు బలగాలు మోహరించారు.






