బాలికపై గ్యాంగ్‌రేప్.. ముగ్గురు నిందితులు అరెస్ట్
posted on: Feb 19, 2026 1:53PM

హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో అదృశ్యమైన బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. నార్సింగ్ లో బాలిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేసిన మూడు రోజులకు.. ఆమెపై ఘట్కేసర్ సమీపంలోని రాంపూర్ వద్ద గ్యాంగ్‌రేప్ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం… పుప్పాలగూడా పాషా కాలనీకి చెందిన బాలిక మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా బాలికను సోహెల్ అనే యువకుడు మాయమా టలు చెప్పి తనతో తీసుకెళ్లినట్లు గుర్తించారు.
అనంతరం అతడు ఘట్కేసర్ సమీపంలోని రాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి, తన స్నేహితులు అర్బాజ్, ఇమ్రాన్‌లతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు బాలిక చేత బలవంతంగా గంజాయి సేవించేలా చేసి ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికను గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రి కి తరలించారు. కాగా పోలీసులు ఘటనపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


.webp)



