Latest News
అద్దెకు తీసుకున్న కారును...అమ్మిన ముఠా అరెస్ట్
posted on: Mar 14, 2026 2:36PM
.webp)
హైదరాబాద్‌లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తామని చెప్పి అద్దెకు తీసుకున్న కారును రాజస్థాన్‌లో విక్రయించిన ముఠాను నల్లకుంట పోలీసులు పట్టుకున్నారు. చాకచక్యంగా నేరానికి పాల్పడిన ఈ గ్యాంగ్ కారులో ఉన్న జీపీఎస్ సిస్టమ్‌ను తొలగించి, అసలు నెంబర్ ప్లేట్లను తీసివేసి ఆధారాలను మాయం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు. నిందితులు హైదరాబాద్‌లో ఒక కారును లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకు న్నారు. అనంతరం కారులో అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తొలగించి, అసలు నెంబర్ ప్లేట్లను కూడా తీసేశారు.
తర్వాత రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ స్క్రాప్‌లో ఉన్న ఒక పాత కారుకు చెందిన నెంబర్ ప్లేట్లు మరియు ఫాస్టాగ్‌ను తీసుకుని, అద్దెకు తీసు కున్న కారుకు అమర్చారు. అంతటితో ఆగలేదండోయ్ ఈ కేటుగాళ్లు... అలా కారును గుర్తించకుండా చేయడమే కాకుండా అక్కడ ఉంటున్న ఓ వ్యక్తికి సుమారు రెండున్నర లక్షల రూపాయలకు విక్రయించారు. కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక మహీంద్రా ఎక్స్‌యువి కారు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు.ఈ ఘటనలో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే తరహాలో మరిన్ని కార్ల మోసాలు జరిగి ఉండొచ్చని అనుమానంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగించారు.






