వరంగల్‌ జిల్లాలో గజేంద్ర మోక్షం రియల్‌ సీన్‌...

భూమ్మీద నూకలు చెల్లిపోతే తాడే...పామై... కాటేస్తుందంటారు. ప్రపంచంలోనే ధనవంతుడైనా... ఎంత పేరు ప్రఖ్యాతలున్నా.... మృత్యువు పిలిస్తే ఎవరైనా వెళ్లిపోవాల్సిందే... అంతేకాదు టైమ్‌ దగ్గర పడితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... ఎవ్వరూ కాపాడలేరు... అయితే భూమ్మీద నూకలుంటే మాత్రం ఆత్మహత్య చేసుకున్నా, ఘోర ప్రమాదం జరిగినా బతికి బట్టకట్టడం ఖాయం... చివరికి శరీరం తూట్లు తూట్లు అయ్యేలా బుల్లెట్లు దిగినా.... ప్రాణాలతో బయటపడతారు.... అందుకే కావాలనుకున్నప్పుడు చావు రాదు... చావాలని రాసిపెట్టి ఉంటే మృత్యువు ఆగదంటారు.... ఓ అవ్వ విషయంలో ఇదే జరిగింది.....

 

వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ఆర్షణపల్లి శివార్లని బొల్లోనిపల్లిలో ఈ వింత జరిగింది... ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారిళ్లకు పంపేసింది గండు సుగుణమ్మ... రెండేళ్ల క్రితం భర్త కాలం చేశాడు... అప్పట్నుంచి ఒంటరిగా జీవిస్తోన్న సుగుణమ్మ.... అనారోగ్యం బారిన పడింది. ఏ పనిచేసుకోవాలన్నా ...కాళ్లూచేతులు సహకరించడం లేదు.... ఆదరించేవాళ్లు ఎవరూ లేరు... ఒకవైపు ఒంటరితనం.... మరోవైపు బతకమే కష్టమైన పరిస్థితి.... దాంతో జీవితంపై విరక్తి చెంది.... ఆత్మహత్య చేసుకోవాలనుకుంది....

 

చావాలని డిసైడై.... ఓరోజు రాత్రి 30-40 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలోకి దూకేసింది. బావిలో నీరు తక్కువగా ఉండటంతో బతికి బట్టకట్టింది. అయితే తీవ్ర గాయాల పాలైంది. బావిలో ఉన్న బురదలో చిక్కుకుపోయింది. అప్పటికే బావిలో ఓ కుక్క... నాగుపాము పడి ఉన్నాయి... బావిలో తలో దిక్కున అవి సుగుణమ్మకు కనిపించాయి... చావాలనే బావిలోకి దూకినా... నాగుపామును చూసేసరికి భయం పుట్టుకొచ్చింది. కాటేస్తుందేమోనని బిక్కచచ్చిపోయింది... రక్షించండంటూ అరుపులు కేకలు వేసింది. అది అర్ధరాత్రి కావడంతో ఎవరూ పట్టించుకోలేదు... అయితే సుగుణమ్మ అరుపులతో బెదిరిన నాగుపాము బుసలు కొడుతూ కాటేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. సుగుణమ్మను కాటేసేందుకు బుసలు కొడుతున్న నాగుపాముకి అక్కడే ఉన్న కుక్క ఎదురు నిలిచింది. పడగ విప్పిన పాముతో కలబడింది. రాత్రంతా పోరాడి నాగుపాము నుంచి సుగుణమ్మను కాపాడింది. అచ్చం హాలీవుడ్‌ సినిమాను తలపించేలా ఈ సీన్‌ సాగింది.

 

మొత్తానికి ఉదయం సుగుణమ్మ అరుపులు కేకలు విన్న జనం.... ఆమెను పైకి తీసేందుకు మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దింపారు. అయితే ఈ క్రమంలో కొన్ని రాళ్లు... బావిలో ఉన్న నాగుపాముపై పడ్డాయి. దాంతో మరోసారి బుసలు కొట్టింది. అయితే కుక్క సుగుణమ్మకు రక్షణగా నిలిచింది. నాగుపాముతో పోరాడింది. నోటితో పట్టుకుని మూడుసార్లు బావికేసి కొట్టింది. ఈ క్రమంలో ఒకసారి నాగుపాము కాటుకు గురైంది. అయినప్పటికీ సుగుణమ్మను బావి నుంచి పైకి తీసేవరకూ రక్షణగా నిలబడింది. ఇదంతా పైనుంచి చూస్తున్న జనం ఆశ్చర్చపోయారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.... ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు మాత్రం వింతగా చెబుతున్నారు. సుగుణమ్మ పెంపుడు కుక్క కాకపోయినా... మనిషిని కాపాడాలన్న ఆలోచన దానికెలా వచ్చిందోనంటూ ఆశ్చర్చపోతున్నారు. ఇదంతా ఓ వింతంగా ఉందంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu