Latest News

కేఆర్ మూర్తికి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం

posted on: Jan 21, 2026 9:02AM

ప్రముఖ పాత్రికేయుడు, వివిధ పత్రికల్లో సంపాదకులుగా పనిచేసిన కె. రామచంద్రమూర్తి(కేఆర్ మూర్తి)కి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం దక్కింది. 2024-25 సంవత్సరానికి ఈ పురస్కారానికి కేఆర్ మూర్తిని ఎంపిక చేసినట్లు  యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి, గజ్జెల మల్లారెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మంగళవారం(జనవరి 20) ప్రకటించారు.

గజ్జెల మల్లారెడ్డి ట్రస్ట్ పక్షాన వైవియు ఏర్పాటు చేసిన పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ నిర్ణయం మేరకు కె. రామచంద్రమూర్తిని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కొండుభట్ల రామచంద్ర మూర్తిగా సుపరిచితులైన ఆయన ప్రముఖ సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్‌గా తన  రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

రెగ్యులర్ ఉపకులపతి లేకపోవడంతో గత రెండు సంవత్సరాలకు సంబంధించిన పురస్కార ప్రదానోత్సవాలు వాయిదా పడ్డాయని, గతంలో ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె. శ్రీనివాస్‌ (2022–23), ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు తెలకపల్లి రవి (2023–24) పురస్కారాలకు ఎంపికైన విషయం తెలిసిం దేనని తెలిపారు. వీరితో పాటు కె. రామచంద్రమూర్తికి ఫిబ్రవరిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తామని, పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు, జ్ఞాపిక ప్రదానం చేస్తామని వీసీ వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...