పవన్ కల్యాణ్ కు గద్దర్ కుమార్తె కౌంటర్

posted on: Jun 4, 2026 9:07AM

తెలంగాణ గడ్డపై రాజకీయ  వేడెక్కింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సంచలనం సృష్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని విస్తరిస్తామనీ, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ   పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాంతీయవాదంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదకరమని  అభివర్ణించారు. అంతేకాకుండా.. తెలంగాణ గడ్డ ఎవరి జాగీరు కాదంటూ పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా గాయకుడు గద్దర్ బతికున్న సమయంలో ఆయనకు తాను వాహనం కొనిచ్చి సహాయం చేశాననీ,     ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తాననీ ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై గద్దరు కుటుంబం మండిపడింది. 

గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్  మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని,  తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని  అవమానించేలా ఉన్నాయని  మండిపడ్డారు. ఈ మేరకు ఆమె   సోషల్ మీడియా వేదికగా  పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "పవన్ కల్యాణ్ ను   ఒక నటుడిగా, గద్దర్ అభిమానిగా తెలంగాణ ప్రజలు గౌరవిస్తారనీ, అయితే..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మాట్లాడిన మాటలను  తెలంగాణ ఆడబిడ్డగా   తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు.  అలాగే.. తెలంగాణ మీ జాగీరా  అన్న పవన్ వ్యాఖ్యలకు బదులిస్తూ.. అవును  తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే, ఈరోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు. ఇది ముమ్మాటికీ మా జాగీరే అని పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...