Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తోందా.. ఈ నిజాలు తెలుసుకోండి..!
posted on: Jul 30, 2026 2:08PM

రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ.. ప్రతిరోజూ రాత్రి నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. రాత్రి పూట ఇలా మూత్ర విసర్జనకు లేవడం అనేది కేవలం నిద్రకు అంతరాయం కలిగించే సమస్య మాత్రమే కాదని, అది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు వైద్యులు. మీరు కూడా ప్రతి రోజూ నిద్ర మధ్యలో మూత్ర విసర్జన కోసం లేస్తుంటే కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి.
మధుమేహం..
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిని మించినప్పుడు, మూత్రపిండాలు అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరం నుండి అధికంగా నీరు కూడా నష్టపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావచ్చు. దీనితో పాటు అధిక దాహం, తరచుగా ఆకలి వేయడం, అలసట, లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
ఓవర్ యాక్టీవ్ బ్లాడర్..
మూత్రాశయం సాధారణం కంటే ఎక్కువగా సంకోచించే పరిస్థితిని ఓవర్ యాక్టీవ్ బ్లాడర్ అని అంటారు. దీనివల్ల వ్యక్తికి తరచుగా , ఆకస్మికంగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, కొన్నిసార్లు రాత్రిపూట చాలాసార్లు నిద్రలోంచి మెలకువ కూడా వస్తుంది. ఈ సమస్య వృద్ధాప్యం, నరాల వ్యాధి, ఊబకాయం లేదా మూత్రాశయ కండరాలు బలహీన వడటం వల్ల ఎదురవుతుంది. సరైన చికిత్స , జీవనశైలి మార్పులతో దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు.
యూటీఐ..
యూటీఐ అనేది మూత్ర మార్గంలోని ఏ భాగానికైనా సోకగల ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, మంట, నొప్పి, దుర్వాసన, మూత్రం మబ్బు రంగులో ఉండటం, కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
మూత్రపిండాల సమస్యలు..
మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను , అదనపు నీటిని తొలగిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రవిసర్జన పరిమాణంలో , సమయంలో మార్పులు సంభవించవచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, పాదాలు లేదా చీలమండలలో వాపు, అలసట, ఆకలి లేకపోవడం , అధిక రక్తపోటు వంటి సమస్యలు మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు కావచ్చు. ఇటువంటి సందర్భాలలో, మూత్రపిండాలను పరీక్షించుకోవడం , వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
అదిక రక్తపోటు, మందుల ప్రభావాలు..
అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు, ముఖ్యంగా డైయూరెటిక్స్ వంటి మూత్రవిసర్జనను పెంచే మందులు, శరీరం నుండి అదనపు ఉప్పు , నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఈ మందులను సాయంత్రం లేదా రాత్రిపూట తీసుకుంటే, రాత్రి సమయంలో చాలాసార్లు బాత్రూమ్‌కు వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపి, మూత్రవిసర్జన అలవాట్లలో మార్పులకు దారితీస్తుంది.
ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలవాలి..
ప్రతి రాత్రి 2-3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కోసం నిద్రలేస్తుంటే వైద్యుడిని కలవాలి.
మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట, మూత్రంలో రక్తం పడటం, ఎన్ని నీళ్లు తాగినా చాలా దాహంగా ఉండటం, కాళ్ళలో వాపులు కనిపించడం, జ్వరంతో పాటు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి.
*రూపశ్రీ.



.webp)


