ఏపీ పాఠశాలల విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు.!

posted on: Jul 16, 2026 2:42PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది. గురువారం (జులై 16) నుంచే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఈ ఉచిత కంటి పరీక్షల స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురువారం (జులై 16) అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి మెరుగైన దృష్టిని అందించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

ఈ   పథకం ద్వారా   రాష్ట్రంలోని ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్య బృందాలు ఆయా పాఠశాలలకే   వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నాయి.

చిన్న వయసులోనే కంటి లోపాలు రావడం వల్ల విద్యార్థుల చదువుపై ఆ ప్రభావం పడకుండా ఉండాలన్న లక్ష్యంతో  ఈ నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   ఈ   కంటి స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులలో వివిధ రకాల దృష్టి లోపాలు లేదా కంటి సమస్యలు బయటపడవచ్చని అధికారులు  అంచనా వేస్తున్నారు. ఇలా పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా ప్రిస్క్రిప్షన్ కళ్లజోళ్లను అందజేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న  నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్‌మెంట్  కింద ఈ   కంటి వైద్య శిబిరాల విధివిధానాలను అమలు చేస్తున్నారు. తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలు సరిగ్గా కనిపించక ఇబ్బంది పడే విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. ప్రతి పాఠశాలలోనూ పారదర్శకంగా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ సాగేలా విద్యా, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

తమ పిల్లల కంటి చూపును మెరుగుపరుచుకునేందుకు,  వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు తల్లిదండ్రులంతా బాధ్యతగా ఈ కంటి పరీక్షల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ  కోరుతున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఈ క్యాంపులకు పిల్లలు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కోరారు. ఈ సదుపాయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు కంటి వైద్య ఖర్చులు తప్పడమే కాకుండా నాణ్యమైన చికిత్స అందుతుంది. 

AP Free Eye Checkup, School Students Eye Screening, Andhra Pradesh News, Free Spectacles Distribution, National Programme for Control of Blindness

google-ad-img
    Related Sigment News
    • Loading...