ఉచిత బ‌స్సు ఎఫెక్ట్ న్యూయార్క్ ను కూడా షేక్ చేసిందిగా!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద వ్య‌తిరేక‌త ఈనాటిది కాదు. ఆయ‌న తొలిసారి గెలిచిన‌పుడు కూడా తీవ్ర జ‌నాగ్ర‌హం వ్య‌క్త‌మైంది.  రాస్తారోకోలు, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, కోర్టు కేసులు  న‌డిచాయ్. ఆయ‌న రెండో సారి ఓడినా, మ‌ళ్లీ తీవ్ర య‌త్నాలు సాగించి మరోసారి అగ్రదేశాధ్యక్షుడయ్యారు. ఎట్ట‌కేల‌కు త‌న సెకండ్ ట‌ర్మ్ డ్రీమ్ నెర‌వేర్చుకున్నారు.  అమెరికా అధ్యక్షపగ్గాలను రెండో సారి చేపట్టీపట్టడంతోనే ఆయన తీసుకున్న తీవ్ర నిర్ణ‌యాల కారణంగా చిక్కుల్లో పడ్డారు. పడుతున్నారు. ఇప్ప‌టికే ట్రంప్ మీద ఎన్నో కేసులున్నాయి. తాజాగా  ఆయ‌న మీద ఎంత వ్య‌తిరేకత ఉందో చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌. ఈ ఎన్నిక అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాకిచ్చింది. న్యూయార్క్ మేయ‌ర్ గా భార‌త ఉగండా మూలాలున్న జోహ్రాన్ మ‌మ్ దానీ ఎన్నిక‌య్యారు. ఈయ‌న మ‌రెవ‌రో కాదు మ‌న భార‌తీయ ద‌ర్శ‌కురాలు మీరానాయ‌ర్- ఉగాండాకి చెందిన మమ్ దానీల‌ కుమారుడే.

మ‌మ్ దాని ఓట‌మి కోసం ట్రంప్ ఎంత రిస్క్ చేశారంటే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం అధికంగా ఉన్న మ‌మ్ దానీని    గెలిపిస్తే న్యూయార్క్ కోసం చాలా చాలా త‌క్కువ నిధులు మాత్ర‌మే మంజూరు చేస్తానని అక్కడి ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు.  అయితే ట్రంప్ హెచ్చరికలను న్యూయార్క్ జనం ఖాతరు చేయలేదు. అత్యంత పిన్న వ‌య‌స్కుడైన 34 ఏళ్ల మ‌మ్ దానీని మేయర్ గా ఎన్నుకున్నారు.   మాజీ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యోమోపై విజ‌యం సాధించి యంగ‌స్ట్ మేయ‌ర్ ఫ‌ర్- ఓల్డెస్ట్ సిటీగా మ‌మ్ దానీ రికార్డు సృష్టించారు.
 
ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ మ‌రో విష‌య‌మేంటంటే.. మ‌మ్ దానీ ద‌క్షిణ భార‌త‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేస్తోన్న‌ ఉచిత సిటీ  బ‌స్సు ప్ర‌యాణాల ప్ర‌క‌ట‌న చేయ‌డం బాగా క‌ల‌సి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. కేవ‌లం బెంగ‌ళూరు, హైద‌రాబాద్ లోనే కాదు న్యూయార్క్ లోనూ ఈ  ఫ్రీబ‌స్ ట్రిక్ ప‌ని చేసిందంటే దీని రేంజ్ ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఫ్రీబ‌స్ ఆఫర్ కి అంత‌ర్జాతీయంగానూ జనం బుట్ట‌లో ప‌డిపోతున్నార‌న్న‌మాట‌.  స‌ర్కార్ కి  ఇదెంత న‌ష్ట‌దాయ‌క‌మైనా కూడా ఇలా జ‌నం లెక్క చేయ‌కుండా ఉచిత  ప్ర‌యాణాల మోజులో ప‌డ్డ‌మేంట‌న్న‌ది పెద్ద చర్చగా మారింది.

ఇదిలా ఉంటే.. నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని మాటివ్వ‌డం, యూనివర్శల్‌ ఛైల్డ్‌ స్కీమ్‌ అమలు చేస్తాన‌న‌డం, 2030 నాటికి కనీస వేతనాల పెంపు గ్యారంటీగా చెప్ప‌డం, కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని త‌న‌ ప్రచారంలో చెప్పుకొచ్చారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఇవి కూడా నగర ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. వీటిన్నింటికీ మించి అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్య‌తిరేకంగా ఎంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటంలోనూ విజ‌యం సాధించారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఏది ఏమైనా లాస్ట్ పంచ్ ఏంటంటే ఇక్క‌డా ఫ్రీ బ‌స్ స్కీమ్ వ‌ర్క‌వుట్ కావ‌డం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu