Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టాటా ఏస్ చక్రాల కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
posted on: Jun 27, 2026 3:48PM
.webp)
వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడు టాటా ఏస్ వాహనం చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పరిధిలోని బోలకపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం, బోలకపూర్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ రివర్స్ తీసి మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. అయితే వెనుక ఉన్న చిన్నారిని గమనించకపోవడంతో వాహనం నేరుగా బాలుడిపైకి ఎక్కింది. ప్రమాదం తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా, స్థానికులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నివాస ప్రాంతాల్లో వాహనాలను రివర్స్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని నిర్ధారించుకోవడంతో పాటు అవసరమైతే మరో వ్యక్తి సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకోవడంతో బోలకపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



.webp)


