మేడారం జాతరకు నాలుగువేల ప్రత్యేక బస్సులు
posted on: Jan 27, 2026 12:31PM
.webp)
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ జాతర కోసం ఏకంగా నాలుగువేల ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి మేడారానికి 50 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులను మంత్రి పొన్న ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులూ తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా కాలినడకన వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులు నేరుగా గద్దెల వద్దకు చేరుకునే ఏర్పాట్లు చేశామని తెలిపిన ఆయన కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే గద్దెల వరకూ చేరుకుంటాయనీ, ప్రైవేటు బస్సులకు ఆ అవకాశం లేదనీ అన్నారు. జాతర కోసం నాలుగువేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపిన మంత్రి పొన్నం, భక్తుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.






