Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విషాదం...ఒకే ఇంట్లో నలుగురు సూసైడ్
posted on: Jun 22, 2026 9:05PM
.webp)
నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సాగర్ రోడ్డులోని ఓ డాబా వెనుక నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి స్థానికులు వెళ్లి పరిశీలించగా.. కుళ్లిన స్థితిలో నాలుగు మృత దేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆధారాలను సేకరిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అను మానిస్తున్నారు. అయితే ఈ కుటుంబం ఇంతటి దారుణ నిర్ణయం ఎందుకు తీసు కుంది? ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఈ ఘటన నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.


.webp)



