నలుగురు బాలికల ఆత్మహత్య

posted on: Feb 10, 2026 9:00AM

బీహార్ లో నలుగురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు మందలించిన కారణంగా ఐదుగురు బాలికలు గత నెల 29న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో నలుగురు బాలికలు మరణించగా, మరో బాలిక ఆస్పత్రిలో కోలుకుంది. కాగా ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆయా బాలికల కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు చేసేశారు. ప్రాణాలతో బయటపడిన ఐదో బాలిక ఇచ్చిన వాంగ్మూలంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషద ఘటన ఔరంగాబాద్ జిల్లా హస్పూరా పోలీసు స్టేషన్ పరిధిలోని దళిత వాడలో జరిగింది. పిల్లలు అబ్బాయిలతో మాట్లాడుతున్నారని కుటుంబ సభ్యులు మందలించిన కారణంగానే వీరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. మృతుల వయస్సు 14 సంవత్సరాలు

ఈ ఘటనపై పోలీసులు సోమవారం (ఫిబ్రవరి 9) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  అప్పటికే మృతుల కుటుంబసభ్యులు  మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది.   దర్యాప్తునకు గ్రామస్తులు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు. ఇకపోతే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బాలిక వాంగ్మూలం ఆఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  పరారీలో ఉన్న కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నామని, బాలికలకు విషం ఎవరిద్వారా లభ్యమైందన్న విషయంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...