Latest News

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

posted on: Jan 20, 2026 9:51AM

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భైంసాలోని సత్ పూల్ వంతెన వద్ద ఒక కంటైనర్ ను కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయ్యింది. కాగా సంఘటన జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను తొలుత భైంసా ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతులనుబాబన్న (70), రాజన్న(60), భోజరం పటేల్(42), డ్రైవర్ వికాస్​గా గుర్తించారు.  హైదరాబాద్​లోని రెయిన్ బో హాస్పిటల్​లో చికిత్సపొందుతున్న బంధువులను చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...