మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

posted on: May 1, 2026 11:22AM

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం (మే1)  ఉదమం జరిగిన   రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.  మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే   ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో   అదుపుతప్పి బోల్తా పడింది.  

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది.  ప్రమాద సమయంలో ఆటోలో పరిమితికి మించిన ప్రయాణీకులు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీ సులు దర్యాప్తు చేపట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...