Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం
posted on: Jul 1, 2026 11:10AM

పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. బోయపాలెం వద్ద నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి.
ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.






