Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరారీలో వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని.!?
posted on: Jul 21, 2026 7:22AM

వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారు. కుటుంబంతో సహా సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు కారులో తన ఇంటి నుంచి కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన 4 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో.. అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.
తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్మినేని కుటుంబం ఆముదాల వలసలో తాము ఉంటున్న నివాసం నుంచి పరారైపోయారు. స్వంత వాహనాలు నివాసం వద్దే వదిలేసి, తమ కదలికలను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసే అవకాశం లేకుండా ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేసి ఓ ప్రైవేటు కారులో వెళ్లిపోయారు.
తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారు కావడానికి కారణమైన భూకబ్జా వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని బలగ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించిన అసలు యజమాని బతికే ఉన్నప్పటికీ.. ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక మహిళను ఆ ఆస్తికి ఏకైక చట్టబద్ధమైన వారసురాలిగా చూపిస్తూ, సదరు భూమిని తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ఆధారాలు సేకరించిన పోలీసులు, దీని వెనుక ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ నెట్‌వర్క్ నెరిపిన దందాను బహిర్గతం చేశారు.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కుట్రలో భాగస్వాములైన 13 మంది నిందితులలో హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ప్రధాన నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం ఆయన కుటుంబం తమ నివాసంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ, పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేయడంలో కాలయాపన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని, తమ్మినేని కుటుంబం చట్టపరమైన న్యాయ సలహాలు స్వీకరించి, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే పరారయ్యారని తెలుస్తోంది.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమదాలవలసలోని టీఎస్ఆర్ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్ల ఆస్తిని ఆక్రమించారనే ఆరోపణలు రాగా, ఇటీవలె రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి అప్పగించారు. వీటితో పాటు, టెక్కలి మండలం చింతామణి గ్రామంలోని 23 ఎకరాల భూమిని బెదిరించి తన కుమారుడి పేరిట రాయించుకున్నారని, అలాగే ఒక మృతుడి కుటుంబానికి చెందిన ఇంటిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అదలా ఉంటే తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీ అయిన నేపథ్యంలో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ్మినేని సీతారాం కుటుబంతో సహా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారనే అనుమానంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలకి దింపి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనం ప్రయాణించిన మార్గాలను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు.
Srikakulam Land Grab Case, YCP Senior Leader, Fake Registration Scam, AP Police Investigation



.webp)


