Latest News
మాజీ ఎమ్మెల్యే కొండి గారి రాములు కన్నుమూత
posted on: Mar 13, 2026 11:00AM

మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు శుక్రవారం (మార్చి 13) ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి రెండు 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండి గారి రాములు స్వగ్రామం మంచాల మండలం ఆరుట్ల గ్రామం. చిన్ననాటి నుండి వామపక్ష భావజాలం కలిగిన ఆయన తొలిసారిగా 1989లో సీపీఎం అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికి ఆర్థికంగా సాధారణ జీవితం గడిపారు. ఆయన సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్ల కాగా ఇబ్రహీంపట్నంలోని బృందావన్ కాలనీలో స్థిరపడ్డారు.
ఆయన నిరాడంబరత, నిజాయితీ, ప్రజలలో మమేకమై ప్రజాసమస్యల కోసం పని చేసే తీరుతో 1994లో రెండోసారి కూడా విజయం సాధించారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో గతంలోని మరణించారు.
ఆయన మూడో కుమారుడు కొండి గారి త్రిలోక్ కుమార్ ఇటీవలి స్థానిక ఎన్నికలలో ఇబ్రహీంపట్నం 12 వార్డు మునిసిపల్ కౌన్సిలర్ గా బీఆర్ఎస్ అబ్యర్థిగా ఎన్నికయ్యారు. కొండిగారి రాములు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.



.webp)


