మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి అస్వస్థత - కిమ్స్‌లో చేరిక

posted on: Feb 20, 2026 1:00PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే  టీ.జీవన్ రెడ్డి   అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను   హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే   తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, దీంతో  ఆసుపత్రికి తరలించామనీ కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.

73 ఏళ్ల వయస్సులో ఆ సీనియర్ సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. వాతావరణ పరిస్థితుల మార్పు, ఎన్నికల్లో అవిశ్రాంతంగా తిరగడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే సంజయ్ వర్గం, జీవన్ రెడ్డి వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి  సంజయ్ వర్గానికి ఛైర్మన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి కేటాయించింది. దానిపై జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

google-ad-img
    Related Sigment News
    • Loading...