మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి కన్నుమూత

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు.    వయస్సుతో వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.  హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ , బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 హైదరాబాద్‌ కోకాపేట్‌లోని హరీశ్‌రావు స్వగృహం క్రిన్స్‌ విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్‌రావు ఇంటికి    చేరుకున్నారు.  తన్నీరు సత్యనారాయణ భౌతిక కాయానికి  మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 తన్నీరు సత్యనారాయణ  కేసీఆర్  స్వయానా బావ. కేసీఆర్ సోదరి లక్ష్మి భర్త అయిన తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.. బావతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu