అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు : హరీష్ రావు

posted on: May 22, 2026 12:27PM

 

అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, టి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తాం… అక్కడ మళ్లీ ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తాం” అంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం అసలు అభి వృద్ధి కాదని, అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయిందని హరీష్ రావు ఆరోపించారు.

 కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఫార్మా సిటీకే ఇచ్చిందని గుర్తుచేస్తూ… ప్రాజెక్ట్‌లో మార్పులు చేసి వేరే అవస రాలకు భూములను ఉప యోగిస్తే రైతుల భూములు తిరిగి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెబుతోంద న్నారు.“ప్రస్తుతం ప్రభుత్వం బయట ఒక మాట… కోర్టు లో మరో మాట మాట్లాడుతోంది” అంటూ రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో కూడా “ఫార్మా సిటీ కొనసాగు తోంది” అని ప్రభుత్వమే తెలిపిందని ఆయన వెల్లడించారు. అయితే ప్రజల ముందు మాత్రం “ఫ్యూచర్ సిటీ” పేరుతో కొత్త కథనం చెబుతోందని అన్నారు.

“ఇది మొత్తం జిమ్మిక్కే. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇందులో అభివృద్ధి దృష్టి లేదు” అని హరీష్ రావు విమర్శించారు. ఫార్మా సిటీకి అనుబంధంగా విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు రావడం సహజమేనని… కానీ ప్రస్తుతం ప్రభుత్వం అసలు ప్రాజెక్ట్ లక్ష్యాన్ని మార్చేస్తోందని ఆరోపిం చారు.“నియమాల ప్రకారం 75 శాతం ఫార్మా పరిశ్రమలు ఉండాలి… మిగిలిన 25 శాతం మాత్రమే అనుబంధ సదుపాయాలు ఉండాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా తారుమారు చేస్తోంది. 75 శాతం రియల్ ఎస్టేట్, వ్యాపార ప్రయోజనాలు… కేవలం 25 శాతం మాత్రమే ఫార్మా రంగానికి కేటాయిం చేలా ప్రణాళికలు వేస్తోంది. 

ఇది చట్టబద్ధం కాదు” అంటూ ఆయన మండిపడ్డారు. ఫార్మా సిటీ ద్వారా తెలంగాణకు భారీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని… రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఫార్మా హబ్‌గా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించిందని హరీష్ రావు గుర్తుచేశారు. “మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటకు వెళ్లకూడదనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చాం” అన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నాయని… కానీ ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు.

 “ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యం లో భూముల వ్యవహారంలో బ్యాక్ ఎండ్ లాభాలు పొందాలనే ఆలోచనతోనే ఈ డ్రామా చేస్తున్నారు” అని ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే దానికి పేరు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే వస్తుందనే రాజకీయ ఆలో చనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటోందని హరీష్ రావు వ్యాఖ్యా నించారు. “వాళ్లు ఎంత ప్రయత్నించినా ఇది నిలబ డదు… చివరికి అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది” అంటూ హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్మా సిటీ వర్సెస్ ఫ్యూచర్ సిటీ చర్చను తెరపైకి తీసు కొచ్చాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...