వైసీపీలో బాలినేని చాప్టర్ క్లోజ్.. మాజీ మంత్రికి శాశ్వతంగా మూసుకుపోయిన తలుపులు

posted on: Mar 20, 2026 3:51PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  బ్యాక్ టు వైసీపీ అన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.  అయితే తాజా పరిణామాలను బట్టి బాలినేనికి శ్రీనివాసరెడ్డికి వైసీపీ తలుపులు పర్మినెంట్ గా క్లోజ్ అయిపోయానని తేటతెల్లమైపోంది. గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం.. తాను స్వయంగా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో బాలినేని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి  జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని  శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు.  అయితే  గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది. జగన్ సైతం ఆయనను దూరం పెట్టారు. ఇటు బాలినేని కూడా తన అసంతృప్తినీ, అసమ్మతినీ బాహాటంగానే సాగారు. అయినా ఇటు బాలినేని కూడా మెడపట్టి బైటకు గెంటినా చూరుపట్టుకు వేళాడినట్లుగా ఎన్ని అవమానాలు ఎదురైనా వైసీపీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారు.

కానీ  2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జనసేన గూటికి చేరడమైతే చేరారు కానీ.. అక్కడ ఆయనకు సరైర గుర్తింపు లభించలేదు. దీంతో బాలినేని తిరిగి వైసీపీ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అది ఉత్తి ప్రచారం మాత్రమేనని తాజా పరిణామంతో తేలిపోయింది.  అదెలా అంటే తాజగా జగన్  ఒంగోలు పార్టీ బాధ్యతలను చుండూరు రవి బాబుకు అప్పగిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో వైసీపీలో బాలినేని చాప్టర్ క్లోజేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. 


అలాగే బాలినేని కూడా తన రాజకీయ భవిష్యత్తుపై తన తాజా పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చారు.  తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో  కలిసి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను  ఇటీవల కలిసిన బాలినేని.. ఆ తరువాత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించారు. జనసేనాని కేవలం పార్టీ అధినేత మాత్రమే కాదనీ, తన నమ్మకం, ఆశ్రయం అంటూ పేర్కొన్నారు. తద్వారా బాలనేని తాను  జనసేనను వీడుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేశారు.   ఒంగోలు రాజకీయాల్లో ఈ మార్పులు   సంచలనంగా మారాయి. బాలినేని అనుచరులు కూడా ఆయన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో రవి బాబు నాయకత్వంలో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందీ, అలాగే  నియోజకవర్గంలో బాలినేని తన పట్టును ఏలా నిలుపుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...