ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం...దుష్ఫ్రచారం నమ్మవద్దు : శిఖా గోయల్

posted on: Feb 8, 2026 4:02PM

 

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై దుష్ఫ్రచారం నమ్మవద్దని  ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. ఏసీబీ, పంజాగుట్ట కేసులకు సంబంధించి కీలక ఆధారాలు కాలిపోయాయన్న వార్తలను ఆమె ఖండించారు. ఆ కేసుల సామాగ్రిని ఇప్పటికే కోర్టులకు సమర్పించామని తెలిపారు. 2024 వరకు సేకరించిన 136 ఆధారల్లో కేవలం 7 మినహా మిగతావన్నీ భద్రంగా ఉన్నాయని తెలిపారు.  2015 నాటి 'ఓటుకు నోటు' కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యాయని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె తేల్చిచెప్పారు. 

ఆ కేసుకు సంబంధించిన 16 మెటీరియల్ ఆబ్జెక్టులను 2015లోనే స్వీకరించి, పరీక్షించిన తర్వాత 2021 మార్చిలోనే ఏసీబీ కోర్టుకు తిరిగి సమర్పించామని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌లో లేదని ఆమె తెలిపారు. ల్యాబ్ కార్యాలయంలోని సీజ్డ్ ప్రాపర్టీస్ విభాగంలో మంటలు చెలరేగాయి. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే అప్రమత్తమైనప్పటికీ, మంటలు వేగంగా ల్యాబ్‌తో పాటు శిక్షణా కేంద్రానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కొన్ని అనాలసిస్ డాక్యుమెంట్ ఫైళ్లు మాత్రమే దగ్ధమయ్యాయని, వాటిని కూడా రికవరీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని శిఖా గోయల్ తెలిపారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...