వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో గలీజ్ దందా
posted on Nov 12, 2025 10:57AM

మియాపూర్‌లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార రాకెట్ ను పోలీసులు బట్టబయలు చేసి.....నిర్వాహకుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసి... జైలుకు పంపించారు. ఒక విదేశీ జాతీయుడు స్టూడెంట్ వీసా పై ఇండియా కి వచ్చి... హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో నివాసము ఉంటూ, ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లకు ఉపాధి పేరుతో మాయ మాటలు చెప్పి వారి చేత బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తు న్నాడు.
అధికారులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకొని వారిని రెస్క్యూ హోంకు తరలించారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది.
ఈ వ్యభిచార రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) అనే యువకుడు నిర్వహిస్తు న్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, మియాపూర్ పరిధిలో స్థానికంగా ఉన్న ఓ కళాశా లలో ఆన్‌లైన్‌లో చదువు కుంటున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే... మరో వైపు ఈ వ్యభిచార దందాకు తెరలేపాడు.
కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లను ఉపాధి పేరుతో నమ్మించి... మోసం చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి.. ఈ దందాను నడిపిస్తున్నట్లుగా విచారణలో తేలింది.పోలీసులు నిందితుడు డేరియస్‌తో పాటు నలు గురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగించారు.