Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
posted on: May 13, 2026 1:24PM

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమైన ప్రయాణికుల వద్ద నుంచి 28 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకుఆ ప్రయాణికుల ప్రవర్తనపై అనుమానం కలగడంతో వారిని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో విదేశీ కరెన్సీ బయటపడింది. అవసరమైన అనుమతులు లేకుండా భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకెళ్లడం చట్ట విరుద్ధం కావడంతో ఆ కరెన్సీని స్వీధీనం చేసుకుని.. ప్రయాణీకులపై కస్టమ్స్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.



.webp)


