వరంగల్ నిట్ లో ఫుడ్ పాయిజనింగ్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

posted on: Mar 2, 2026 11:22AM

వరంగల్ నిట్ లో ఫుడ్ పాయిజినింగ్ అయ్యింది. దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిట్ లో  స్ప్రింగ్ స్ప్రీ పేరుతో   3 రోజులు  వేడుకలు జరిగాయి ,  వేడుకల చివరి రోజు రాత్రి సమయంలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు.

 ఈవెంట్ జరుగుతున్నసమయంలో  నిట్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ లో తిన్న ఫుడ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా వరంగల్ నిట్ లో ఫుడ్ పాయిజినింగ్ జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...