కలుషిత ఆహారం.. ధర్మవరం బీసీ హాస్టల్ లో విద్యార్థులకు అస్వస్థత
posted on Nov 1, 2025 5:14PM
.webp)
కలుషిత ఆహారం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ హాస్టల్ లో నిన్న రాత్రి భోజనం వికటించి 53 మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురికావడంతో వారిని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతంనిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదనీ అధికారులు వెల్లడించారు. ధర్మవరం బీసీ హాస్టల్‌లో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వీరిలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు.
53 మంది వాంతులు, విరోచనాలతో బాధపడటంతో వారికి గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి తక్షణమే చికిత్స అందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, ఆందోళన అవసరంలేదనీ తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కు కారణాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.