గోదావరికి భారీగా వరద.. పోలవరం ప్రాజెక్టుకు లక్ష్య క్యూసెక్కుల వరద నీరు.!

posted on: Jul 8, 2026 12:50PM

గోదావరికి వదర పోటెత్తుతోంది. ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వరద ధాటికి పోలవరం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. మరో వైపు వరద ఉధృతికి   స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఎగువ రాష్ట్రాలైన  మహారాష్ట్ర, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురవడంతో  గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహించి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదవరిలో  వరద ప్రవాహం భారీగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా గోదావరి నీటిమట్టం  వేగంగా పెరుగుతోంది.  ఇదే పరిస్థితి కొనసాగితే.. బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

flood inflow into the Godavari, Polavaram, SpillWay, Washed, Dhawleswaram, Barriege, Telugunews

google-ad-img
    Related Sigment News
    • Loading...