కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం

posted on: Feb 28, 2026 8:41AM

బోలివియాలో శుక్రవారం (ఫిబ్రవరి 27) జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు.   కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం ఎల్ ఆల్టో నగరంలో రద్దీగా ఉండే రహదారిపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో   15 మంది మరణించగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా  గాయపడ్డారు.

బోలివియా వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం సెంట్రల్ బ్యాంక్ నోట్లతో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి సమీపంలోని రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానం ముక్కలైపోయింది. దీంతో   ా విమానంలోకి కరెన్సీ నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ కరెన్సీ నోట్లు ఏరుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.  పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు.

కాగా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో  విమాన సిబ్బందితో పాటు,   రోడ్డుపై వెడుతున్న సామాన్య పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో  గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అధికారులు ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...