కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 15 మంది మృతి

posted on: Jan 29, 2026 8:05AM

కొలంబియాలో  జరిగిన ఘోర విమాన ప్రమాదంలో  15 మంది దుర్మరణం పాలయ్యారు.  మృతులలో  ప్రముఖ రాజకీయ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త డియోజెనెస్ క్వింటెరో  ఉన్నారు. 

 కుకుటా విమానాశ్రయం నుంచి ఒకాన్యాకు వెడుతున్న ఈ విమానానికి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  కురాసికా అనే మారుమూల గ్రామీణ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత అందులో ఎవరూ ప్రాణాలతో మిగిలిలేరని అధికారులు ధ్రువీకరించారు,  ఈ విషాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...