వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. 

ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది. 

 ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు