Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
posted on: Mar 20, 2026 2:39PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం–కూనవరం రోడ్డులో గోదావరి నది వద్ద స్నానానికి వెళ్లిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. నది ప్రవాహంలో ఐదుగురు యువకులు గల్లంతవగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన ఏడుగురు యువకులు విహారయాత్రలో భాగంగా కూనవరం సమీపంలోని గోదావరిలో స్నానాలకు దిగారు. అయితే నది లోతు, ప్రవాహం అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వారిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు తీవ్ర ఆందోళనలో ఒడ్డుకు చేరుకున్నారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బోట్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటన స్థలానికి చేరుకుని శోధన కొనసాగిస్తున్నారు.విహారయాత్రకు వెళ్లిన యువకులపై ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


.webp)



