ఫుట్ బాల్ మైదానంలో కాల్పులు.. 11 మంది దుర్మరణం

posted on: Jan 27, 2026 11:56AM

మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. గ్వానా జువాటో రాష్ట్రం సలమాంకా నగరంలోని ఓ ఫుట్ బాల్ మైదానంలో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. అక్కడి కమ్యూనిటీ ఫుల్ బాట్ గ్రౌండ్ లో మ్యాచ్ ముగిసిన తరువాత సాయుధులైన దుండగులు క్రీడాభిమానులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో 11 మంది మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.  ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...