Latest News
పోలీసులపై కాల్పుల యత్నం.. విజయవాడలో కలకలం
posted on: Mar 7, 2026 10:05AM
.webp)
విజయవాడలో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరపడానికి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఏకంగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.
అయితే సాంకేతిక లోపం కారణంగా తుపాకీ పేలలేదు. దీంతో పోలీసులకు ఎటువంటి అపాయం జరగలేదు. కాగా తన కాల్పుల యత్నం విఫలం కావడంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకుని అతడి వద్ద నుంచి తుపాకితో పాటు ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై కాల్పులకు యత్నించిన వ్యక్తిని వరంగల్ జిల్లా, నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హోటల్ గదిలో తుపాకీతో ఎందుకు ఉన్నాడు..? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న విషయాలు తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నారు.






