Latest News
బాలీవుడ్ డైరెక్టర్ ఇంటి వద్ద కాల్పులు.. ముంబైలో హైఅలర్ట్
posted on: Feb 1, 2026 7:26AM

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద ఆదివారం (ఫిబ్రవరి 1) తెల్లవారుజామున కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు జుహూలోని రోహిత్ శెట్టి నివాసం వద్ద నాలుగు రౌండ్లు కాల్పలు జరిపి పరారయ్యారు. కాల్పుల ఘటన జరిగిన సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లోనే ఉన్నారు. ఈ కాల్పులలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. గతంలోనూ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల ఇళ్ల వద్ద కాల్పుల ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై రోహిత్ శెట్టి స్పందించాల్సి ఉంది.






