Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ వేసవిలో ఎపీ నిప్పులగుండమే!
posted on: Mar 5, 2026 12:49PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది వేసవి నిప్పుల వాన కురిపించబోతోంది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒక ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే ఇప్పుడే ఏపీలో వేసవి తీవ్రత అధికంగా ఉందని చెబుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నది.
రానున్న రోజులలో రాష్ట్రం నిప్పుల గుండంగా మారిందా అనిపించేలా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నది. మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదౌతున్నాయి. ఈ వేసవిలో ఉత్తరాంధ్ర, కర్నూలు, ప్రకాశం, ఒంగోలు, అనంతపురం, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
వేసవిలో వడదెబ్బ కారణంగా మరణాలు సంభవించకుండా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.



.webp)


