Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్టీసీ బస్సులో మంటలు...కిటికీల్లోంచి దూకిన ప్రయాణికులు
posted on: Jun 6, 2026 4:19PM

ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో అకస్మా త్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రయాణం సజావు గా సాగుతుండగా బస్సులో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది. క్షణాల్లోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పరిస్థితిని వెంటనే గుర్తించిన డ్రైవర్ సమయం స్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు ఆపేశారు.అయితే మంటలు కనిపించ గానే ప్రయాణికుల్లో గందర గోళం నెలకొంది. కొందరు ప్రధాన ద్వారం ద్వారా బయటకు పరుగులు తీయగా, మరికొందరు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆత్రుతతో కిటికీల్లోంచి దూకేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ భయానక వాతా వరణం నెలకొంది. బస్సు డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సులో ఉన్న ప్రయాణికు లందరూ సురక్షితంగా బయటపడడంతో ప్రాణం నష్టం జరగలేదు. ఘటనతో స్థానికులు కూడా ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారణాలపై విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమా దం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. "డ్రైవర్ చాకచక్యంతో పెను విషాదం తప్పింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయానికి గురిచేసింది.



.webp)


