ఆర్టీసీ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
posted on: Feb 6, 2026 8:45AM
.webp)
ప్రయాణీకులతో వెడుతున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు రేగిన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేలఃట విన్నమాల క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. తిరుపతి నుంచి వినుకొండకు వెడుతున్న ఈ బస్సులో సంఘటన జరిగిన సమయంలో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఈ బస్సు నాయుడుపేటలోని విన్నమాల క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణీకులను దించేశాడు అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. బస్సులోని ప్రయాణీకులను ఇతర వాహనాలలో గమ్యస్థానాలకు చేర్చారు.






