కారులో మంటలు

posted on: Apr 15, 2026 9:21AM

బేగంపేట లో  నడుస్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింద. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...